థియేటర్ ను ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్..!

అభిమానం ఉండాలే కాని అది హద్దులు దాటకూడదు. వారిని అదుపులో పెట్టాల్సిన బాధ్యత కచ్చితంగా ఆ స్టార్స్ మీదే ఉంటుంది. అభిమానుల విధ్వంసాలకు స్టార్ హీరోల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటివి స్టార్ హీరోలు కూడా ప్రోత్సహించరు కాని అభిమానుల విధ్వంసాలు మాత్రం ఆగట్లేదు. లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ బిగిల్ సినిమా స్పెషల్ షో వేయలేదని తమిళనాడులో కృష్ణగిరిలో ఓ థియేటర్ ను ధ్వంసం చేశారు విజయ్ ఫ్యాన్స్.

కేవలం థియేటర్ ను మాత్రమే కాదు ఆ చుట్టు పక్కల షాపులకు నిప్పు అంటించారు.. అంతేకాదు ప్రభుత్వ వాహనాల మీద వారి ప్రతాపం చూపించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సిసి టివి ఫుటేజ్ ల సహకారంతో గొడవకు కారణమైన విజయ్ ఫ్యాన్స్ 37 మందిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కేవలం స్పెషల్ షో వేయలేదన్న కారణం చేత ఇంత విధ్వంసం సృష్టించాల్సిన అవసరం లేదు. దీనిపై తమిళనాడు ప్రభుత్వంతో పాటుగా పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా ఉంది.   

అయితే ఈ ఇష్యూపై హీరో విజయ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బిగిల్ రిలీజ్ ముందు వరకు సినిమా కథ తనదంటూ ఒక దర్శకుడు కోర్ట్ లో కేసు వేయగా అది క్లియర్ చేసుకుని రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ రోజు విజయ్ ఫ్యాన్స్ చేసిన ఈ గొడవ వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తుంది.. ఈ ఘటనపై సాధారణ ప్రజలు కూడా విజయ్ మీద, అతని ఫ్యాన్స్ మీద మండిపడుతున్నారు.