దర్శకుడి నిర్మాణంలో 'జాతిరత్నాలు'

మహానటి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన నాగ్ అశ్విన్ ఆ సినిమా తర్వాత డైరక్టర్ గా ఏ సినిమా చేస్తాడో ఇంకా డిసైడ్ అవలేదు. దర్శకుడిగా రెండు సినిమాలు చేసిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుదీప్ కెవి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ మూవీకి జాతిరత్నాలు అంటూ టైటిల్ పెట్టారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తన భార్య ప్రియాంక దత్ సొంత బ్యానర్ స్వప్నా సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించి మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి. జాతిరత్నాలు టైటిలే క్యాచీగా ఉండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు అంటే కథ ఎంత బాగుంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి తీసిన రెండు సినిమాలతోనే దర్శకుడిగా సత్తా  చాటిన నాగ్ అశ్విన్ నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.