
విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవిత కథతో జీవన్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా జార్జ్ రెడ్డి. ఈమధ్య రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. ఇదిలాఉంటే ఈ సినిమా ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మెప్పించిందని తెలుస్తుంది. జార్జ్ రెడ్డి ట్రైలర్ చూసి ప్రత్యేకంగా డైరక్టర్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించాడట పవన్ కళ్యాణ్. వంగవీటి సినిమాలో నటించిన సందీప్ (శాండీ) ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించారు.
గొప్ప విద్యార్ధి నాయకుడి కథను సినిమాగా తీసినందుకు జీవన్ ను ప్రశంసించాడట. అంతేకాదు ఈ సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్ చేసేందుకు పవన్ ఓకే చెప్పినట్టు టాక్. నవంబర్ 22న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూసి ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి పవన్ సపోర్ట్ జార్జ్ రెడ్డి సినిమాకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.