
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తవగా టైటిల్ ఏంటన్నది ఇంకా వెళ్లడించలేదు. అయితే రీసెంట్ గా బాలకృష్ణ 105వ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ కన్ ఫ్యూజన్ కు తెర పడాలంటే దీవాళి వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ దీపావళికి నందమూరి ఫ్యాన్స్ కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు బాలయ్య బాబు. టైటిల్ పోస్టర్ తో పాటుగా సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కె.ఎస్ రవికుమార్ తో జై సింహా తర్వాత బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అసలైతే 2020 సంక్రాంతి రేసులో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తుంది.