నాని నుండి సెకండ్ ప్రాజెక్ట్

నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు. నిర్మాతగా మొదటి సినిమా అ!తో సక్సెస్ అందుకున్న నాని లేటెస్ట్ గా తన సెకండ్ మూవీని స్టార్ట్ చేశాడు. శైలేష్ డైరక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా వస్తుంది. ఈరోజు షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ మూవీకి హిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు సినిమాకు సంబందించిన ప్రీ లుక్ కూడా ఒకటి రిలీజ్ చేశారు.  

సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుహాని శర్మ నటిస్తుంది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. అ! తర్వాత నాని నిర్మిస్తున్న మూవీ కాబట్టి ఈ హిట్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడతాయి. నాని మార్క్ ప్రమోషన్స్ ఎలాగు సినిమాపై క్రేజ్ తెస్తాయని చెప్పొచ్చు. మరి నాని చేస్తున్న ఈ హిట్ మూవీ టైటిల్ కు తగినట్టుగా బాక్సాఫీస్ దగ్గర కూడా హిట్ అనిపించుకుంటుందో లేదో చూడాలి.