
కోలీవుడ్ సూపర్ హిట్ డైరక్టర్ అట్లీ లేటెస్ట్ గా విజిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విజయ్ హీరోగా వస్తున్న ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళంలో బిగిల్ తెలుగులో విజిల్ గా వస్తున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తెలుగులో ఈ మూవీని మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విజిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరక్టర్ అట్లీ కామెంట్స్ అందరిని అలరించాయి.
తను చేసిన ప్రతి సినిమా తెలుగులో మంచి ఆదరణ లభిస్తుందని.. అందుకే ఇక్కడ స్ట్రైట్ సినిమా కోసం తాను వెయిట్ చేస్తున్నా అని అన్నాడు అట్లీ. ఇక తన సినిమా ఏది రిలీజైనా సరే ఎన్.టి.ఆర్ ఫోన్ చేసి బాగుందని చెబుతారని.. తెలుగులో ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు అట్లీ. ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ గెస్ట్ గా వచ్చారు. మహేష్ కోనేరు నిర్మాతగా తన డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.