
ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి చేస్తున్న మూవీ ఫైటర్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తుందని అన్నారు.
ఒరు అధార్ లవ్ అదే తెలుగులో లవర్స్ డేగా రిలీజైంది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు కాదు తన లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రియా ప్రకాశ్ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటుంది. అయితే విజయ్ సినిమా కన్నా ముందే సందీప్ కిషన్ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిన ప్రియా ప్రకాశ్ నితిన్ తో ఓ మూవీ సైన్ చేసినట్టు తెలుస్తుంది.
అయితే విజయ్, పూరి సినిమాలో ప్రియా ప్రకాశ్ బదులుగా జాన్విని తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాత పూరి జగన్నాథ్. శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ను ఊపేస్తున్న జాన్వి సౌత్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఓ మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. పూరి, విజయ్ క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈ మూవీ కోసం జాన్వి ఓకే చెప్పినట్టు టాక్. అదే నిజమైతే మాత్రం ఆ సినిమాకు హిందిలో కూడా క్రేజ్ ఏర్పడుతుంది.