
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ మూవీలో విజయశాంతి ఎలా ఉండబోతుందో అని ఆమె ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ దీవాళికి సర్ ప్రైజ్ గిఫ్ట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దానితో పాటుగా ఫస్ట్ లుక్ టీజర్ కూడా వస్తుందని తెలుస్తుంది. వరుస హిట్లతో ఉన్న డైరక్టర్ అనీల్ బ్యాక్ టూ బ్యాక్ హిట్ ఫాం లో ఉన్న మహేష్ ఇద్దరు కలిసి సరిలేరు నీకెవ్వరుతో సరిలేని రికార్డులను కొట్టేయాలని ఆశిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.
సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి. ఈ మూవీతో పాటుగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ పై నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు మహేష్ అల్లు అర్జున్. మరి వీరిద్దరిలో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారో చూడాలి.