బండ్ల గణేష్ అరెస్ట్

తెలుగు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ను జూబ్లీహిల్స్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. నిర్మాత పివిపి దగ్గర ఫైనాన్స్ గా తీసుకున్న డబ్బు విషయమై ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో లీగల్ గా ప్రొసీడ్ అవదలచాడు వర ప్రసాద్. డబ్బులు ఇవ్వకపోగా బండ్ల గణేష్ బెదిరింపులకు దిగడంతో పి వర ప్రసాద్.. బండ్ల గణేష్ మీద కేసు పెట్టారు.   

కేసు పెట్టిన దగ్గర నుండి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న బండ్ల గణేష్ ఎట్టకేలకు ఈరోజు జూబ్లీహిల్స్ లో విచారణలో పాల్గొన్నారు. అనంతరం బండ్ల గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. బండ్ల అరెస్ట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ గా మారింది. 

టెంపర్ సినిమాను నిర్మించిన బండ్ల గణేష్ పివిపి దగ్గర కొంత మొత్తాన్ని ఫైనాన్స్ గా తీసుకున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతని మీద కేసు వేశారు నిర్మాత పివిపి. డబ్బులు అడుగుతున్నాడని పివిపి ఇంటి మీద కూడా కొందరిని పంపించి బెదిరింపులకు దిగాడట బండ్ల గణేష్. అందుకే పోలీసుల ముందు విచారణకు హాజరైన బండ్ల గణేష్ ను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.