సొంత కుంపటి పెట్టిన మంచు మనోజ్

ఈమధ్యనే తన భార్య ప్రణతితో విడిపోతున్నట్టు ప్రకటించిన మంచు మనోజ్ ఇక మీద తను వరుస సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు హామి ఇచ్చాడు. అన్నట్టుగానే హీరోగానే కాదు నిర్మాతగా మారి సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు మంచు హీరో. మంచు మనోజ్ సొంత బ్యానర్ స్టార్ట్ చేశాడని తెలుస్తుంది. ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాడట. సొంత బ్యానర్ లో నూతన దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది.  

త్వరలోనే ఆ సినిమా వివరాలు బయటకు రానున్నాయి. కేవలం తన కోసమే కాదు మంచు మనోజ్ బ్యానర్ లో బయట హీరోలతో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే స్టార్ హీరోలు సెపరేట్ బ్యానర్ పెట్టుకుని వారి సినిమాల్లో షేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే దారిలో మంచు మనోజ్ కూడా సొంత బ్యానర్ స్టార్ట్ చేశాడు. అయితే ఇందులో ఇతర హీరోలకు ఛాన్స్ ఉంటుందని అన్నాడు. మరి అది ఎప్పుడు ఎలా మొదలవుతుందో చూడాలి.

హీరోగా మంచి క్రేజ్.. నటించగలిగిన సత్తా ఉన్నా సరే మంచు మనోజ్ ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కెరియర్ లో వెనుకపడ్డాడు. అయితే ఇక మీదట అలా జరగదని రీసెంట్ గా ఓ లాంగ్ మెసేజ్ కూడా పెట్టాడు. మరి మనోజ్ హీరోగా మళ్లీ మునుపటి క్రేజ్ తెచ్చుకుంటాడా.. హీరోగా సక్సెస్ అవగలడా అన్నది తెలియాలంటే ఆ సినిమాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.