'రంగమార్తాండ' కోసం పరుచూరి బ్రదర్స్..!

మరాఠిలో సూపర్ హిట్టైన నట సామ్రాట్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ. ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తుందని తెలుస్తుంది. మరాఠిలో నానా పటేకర్ నటించగా అక్కడ ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడిన కృష్ణ వంశీ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమా టార్గెట్ మిస్ అవకుండా ఉండాలని తెలుగు రీమేక్ కోసం పరుచూరి సోదరుల సహయాన్ని తీసుకుంటున్నాడట కృష్ణ వంశీ. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150తో మళ్లీ ఫాం లోకి వచ్చిన పరుచూరి బ్రదర్స్ రీసెంట్ గా వచ్చిన సైరా నరసిం హా రెడ్డి సినిమాకు రచనా సహకారం అందించారు. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాకు వారి కలం పనిచేస్తుంది. మరి కృష్ణవంశీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.