జెర్సీ బ్యూటీ అప్పుడలా.. ఇప్పుడిలా..!

కొంతమంది చిన్నప్పటి నుండి తమని తెర మీద చూపించుకోవాలని కలలు కంటారు. కాని మరి కొంతమంది మాత్రం అనూహ్యంగా హీరోయిన్స్ గా మారుతారు. అలాంటి వారిలో తాను ఒకదాన్ని అంటుంది జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్. కన్నడలో సూపర్ క్రేజ్ సంపాదించిన ఈ అమ్మడు తెలుగులో జెర్సీ సినిమాతో మెప్పించింది. రీసెంట్ గా ఆది సాయికుమార్ తో జోడీ మూవీలో కూడా నటించింది శ్రద్ధా శ్రీనాథ్.    

సౌత్ అన్ని భాషల్లో నటించే అతి కొద్దిమంది హీరోయిన్స్ లో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరని చెప్పొచ్చు. లేటెస్ట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టి.. దానికి సంబందించి పెద్ద మెసేజ్ కూడా పెట్టింది. లా కంప్లీట్ చేసిన శ్రద్ధ శ్రీనాథ్ న్యాయశాఖలో పనిచేస్తున్న టైంలో ఎలాంటి వర్క్ అవుట్స్ చేసేది కాదట. తన దగ్గర కావాల్సినంత డబ్బు ఉండటం వల్ల అప్పట్లో ఖరీదైన దుస్తులు.. ఏది తినాలనిపిస్తే అది తినేదాన్నని చెప్పుకొచ్చింది. అందుకే అప్పట్లో చాలా లావుగా ఉండేదాన్నని.. అప్పుడు తాను అందంగా ఉన్నానని భావించేదట.. కాని ఆ తర్వాత వర్క్ అవుట్స్ మొదలు పెట్టాక బరువు తగ్గానని అన్నది.   

కేవలం ఇదంతా తనని తాను అందంగా కనిపించడానికి చేశానని.. డైట్ విషయంలో సరైన కార్యచరణ లేకుండా అనారోగ్య పాలవుతారని తన ఫ్యాన్స్ ఫాలోవర్స్ కు చెబుతుంది శ్రద్ధ శ్రీనాథ్.