
సుమంత్ బోణీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కృతి కర్బందా. ఆ సినిమా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మార్ లో ఛాన్స్ అందుకుంది. బాలీవుడ్ మూవీ లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా తెలుగు ఆడియెన్స్ కు రుచించలేదు. అందుకే ఇక్కడ సినిమా ఫ్లాప్ అయ్యింది.. చూడడానికి ఎంత బాగున్నా హిట్టు పడకపోతే ఐరన్ లెగ్ పేరు పడిపోద్ది. అలానే కృతికి తెలుగులో బ్యాడ్ నేమ్ వచ్చింది.
తెలుగు, తమిళ భాషల్లో సరైన అవకాశాలు అందుకోలేని కృతి చిన్నగా బాలీవుడ్ కు మకాం మార్చేసింది. హిందిలో కూడా ఆశించిన స్థాయిలో కెరియర్ లేకున్నా సినిమాలైతే చేస్తుంది కృతి కర్బంద. అక్కడ సినిమాలు చేస్తూ బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో పడ్డదని టాక్. ఇద్దరు కలిసి లాస్ట్ ఇయర్ వీరే కి వెడ్డింగ్ సినిమాలో నటించి మెప్పించారు. లేటెస్ట్ గా మళ్లీ ఇద్దరు కలిసి పగల్ పంటీ సినిమాలో జోడీ కడుతున్నారు.
ఆల్రెడీ పెళ్లైన పులకిత్ తన భార్య శ్వేతాతో డైవర్స్ తీసుకున్నాడు. మరి పెళ్లైన పులకిత్ లో కృతి ఏం చూసి పడిపోయిందో కాని ప్రస్తుతం ముంబైలో వీరిద్దరి లవ్ టాపిక్ హాట్ న్యూస్ గా మారింది. మరి వీరి ప్రేమ పెళ్లిదాకా వెళ్తుందో లేదో త్వరలో తెలుస్తుంది.