బిగ్ బాస్ తర్వాతే ఏదైనా.. !

నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉండగా రాబోయే ఆదివారం వరకు మరొకరు ఎలిమినేట్ అవుతారు. ఇక మిగిలిన టాప్ 5లో టాప్ 2..  ఆ తర్వాత టైటిల్ విన్నర్ ను ఎనౌన్స్ చేస్తారు. హోస్ట్ గా నాగార్జున కూడా ముందు కాస్త తడపడ్డా తర్వాత సెట్ అయ్యాడు.

అయితే చేస్తున్న బిగ్ బాస్ తప్ప తన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆలోచన చెయ్యట్లేదు నాగ్. బంగార్రాజు మొదలు పెట్టడమే లేట్ అనేట్టు ఉండగా సినిమాపై  నాగ చైతన్య ఇంట్రస్ట్ చూపించడం లేదట. అందుకే బిగ్ బాస్ పూర్తి చేసిన తర్వాతనే నాగ్ తన నెక్స్ట్ సినిమా మీద ఒక క్లారిటీ వస్తోందని తెలుస్తుంది.