అలి కోన్ కిస్కా గొట్టం అన్నది ఎవరిని..?

ఎప్పుడు సరదాగా మాట్లాడే అలి సీరియస్ అవడం చూడలేదు. మాములుగా వివాదాలకు కూడా ఆయన దూరంగా ఉంటారు. సినిమాలు తగ్గించి టాక్ షోల మీద పడిన అలి వచ్చిన సినిమా ఆఫర్ ను చేస్తున్నాడు. లేటెస్ట్ గా అలీ చేసిన సినిమా రాజు గారి గది 3. ఓంకార్ డైరెక్షన్ లో అశ్విన్, అవికా గోర్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ రివ్యూలతో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతుంది.

ఈ మూవీ సక్సెస్ మీట్ లో అలి సినిమా బాగాలేదు అంటూ ప్రచారం చేస్తున్న వారి మీద ఫైర్ అయ్యాడు. సినిమా నచ్చాల్సింది ప్రేక్షకులకు అంతే కాని కోన్ కిస్కా గొట్టం గాళ్లకు కాదు అన్నాడు. ఇన్ డైరెక్ట్ గా అలి రివ్యూ రైటర్స్ నే అన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి సడెన్ గా అలి ఇలా ఎందుకు ఫైర్ అయ్యాడు ఇదివరకు తను నటించిన సినిమాలకు ఇంతకంటే ఘోరంగా రివ్యూలు వచ్చినా పట్టించుకోలేదు. అలి అలా ఎందుకు మాట్లాడాడు అన్న దాని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి.