
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. ముందు దసరా ఆ తర్వాత క్రిస్ మస్ కు ఈ మూవీ రిలీజ్ అనుకున్నారు. కాని ఇప్పుడు ఈ మూవీని 2020 సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. అయితే ఈ సినిమా లేట్ అవడానికి కారణం నిర్మాత సురేష్ బాబు అని తెలుస్తుంది.
సినిమా సిజి వర్క్ విషయంలో బాగా లేట్ అవుతుందట. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని సురేష్ బాబు ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. వెంకీమామ సినిమా రిలీజ్ వాయిదా అవడానికి ప్రధాన కారణం ఇదే అని తెలుస్తుంది. సినిమా లేట్ అయినా సరే ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని అంటున్నారు. దసరాకి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాను కెఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తున్నారు.