
కోలీవుడ్ హీరోలకు తెలుగులో కూడా బాగానే మార్కెట్ ఉంటుంది. రజినికాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య, విక్రం తెలుగు ప్రేక్షకులను అలరించారు. కార్తి, విజయ్ లు కూడా తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక్కడ స్టార్స్ తో పోటీ పడకుండా తమ సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు తమిళ హీరోలు. సంక్రాంతికి మాత్రమే ఏదో ఒక తమిళ సినిమా వస్తుంటాయి.
తమిళంలో దీవాళిని ఘనంగా జరుపుకుంటారు. అక్కడ వారికి ఇది చాలా పెద్ద పండుగ. అందుకే దీవాళి టార్గెట్ తో అక్కడ స్టార్స్ సినిమాలు వస్తున్నాయి. ఈ దీవాళికి విజయ్ బిగిల్, కార్తి ఖైది రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగులో కూడా ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. అక్టోబర్ 2న వచ్చిన సైరా సందడి కూడా తగ్గింది. సో తమిళ హీరోల సినిమాలు తెలుగులో పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో విజయ్ విజిల్ కు క్రేజీ బాగానే ఉన్నా అతనికన్నా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తి ఖైది ఎక్కువ అంచనాలతో వస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.