RRR లో అనుష్క..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ వంటి క్రేజీ స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ రోల్ లో స్వీటీ అనుష్క కూడా నటిస్తుందని తెలుస్తుంది.    

రీసెంట్ గా వచ్చిన సైరా సినిమాలో కూడా ఝాన్సి లక్ష్మి బాయి పాత్రలో నటించింది అనుష్క. చేసింది చిన్న పాత్రే అయినా అనుష్క మాత్రం అదరగొట్టింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ లో కూడా అనుష్క నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్ధం సినిమాలో నటిస్తుంది. కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడు.