
2020 సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీనే రసవత్తరంగా మారనుంది అనుకుంటుంటే సంక్రాంతి పోటీ మరింత హంగామా సృష్టించేలా వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న వెంకీమామ సినిమా కూడా పొంగల్ వార్ కు ఫిక్స్ అయ్యింది. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబీ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరు మామా అళ్లుల్లుగా అదరగొట్టేయడం ఖాయమని తెలుస్తుంది.
ఇప్పటికే ఒకేరోజు అనగా జనవరి 12నే మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ రేసులో వెంకీమామ కూడా వచ్చి చేరింది. అయితే వెంకీమామ మాత్రం 14 న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమా జనవరి 10న రిలీజ్ అంటున్నారు. సంక్రాంతికి సెంటిమెంట్ గా కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా నందమూరి ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి.
మరి ఈ పొంగల్ వార్ లో ఎవరు విజయ పతాకం ఎగురవేస్తారో చూడాలి. మహేష్, బన్ని సినిమాల మధ్య టఫ్ ఫైట్ నడవడం ఖాయం. మరి స్టార్ సత్తా తెలిసేలా ఈ సంక్రాంతికి మరింత కలర్ ఫుల్ గా మారనుంది.