యంగ్ హీరో డాక్టర్ తో లవ్..!

యువ హీరో నిఖిల్ ఓ డాక్టర్ తో ప్రేమలో పడ్డాడట. మంచు లక్ష్మి హోస్ట్ గా సెలబ్రిటీస్ బెడ్ రూం సీక్రెట్స్ తో వస్తున్న షో ఫీట్ అప్ విత్ స్టార్స్. ఈ షోలో భాగంగా ఇప్పటికే చాలమంది స్టార్స్ తో చిట్ చాట్ చేసిన మంచు లక్ష్మి లేటెస్ట్ గా నిఖిల్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇక అందులో భాగంగా తన ప్రేయసి గురించి ఓపెన్ అవ్వక తప్పలేదు నిఖిల్ కు. తను ఒక డాక్టర్ అని.. తనని బాగా అర్ధం చేసుకున్న అమ్మాయని అన్నాడు నిఖిల్.  

ఆమె తనకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించదని.. ఫ్రెండ్స్ తో ఉన్నా.. షూటింగ్ టైంలో అయినా అసలు తనని డిస్ట్రబ్ చేయదని. నా ఫోన్ కూడా చెక్ చేయదని చెబుతున్నాడు నిఖిల్. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుందని ఆమె దానికి చాలా రెస్పెక్ట్ ఇస్తుందని అన్నాడు నిఖిల్. మొత్తానికి నిఖిల్ చెబుతున్న ఆ అమ్మాయి ఎవరో కాని నిఖిల్ మనసు గెలుచుకున్న ఆమె చాలా అదృష్టవంతురాలని తెలుస్తుంది.    

కెరియర్ లో ఇంకా సరైన రేంజ్ కోసం ప్రయత్నిస్తున్న నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ సూపర్ హిట్ మూవీ కణితన్ కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది.