2021 సంక్రాంతికి RRR..?

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మరో పెద్ద ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ఎనౌన్స్ చేశారు. సినిమా గురించి వస్తున్న రూమర్స్ అన్నిటిని చెక్ పెడుతూ కథ ఇలా ఉంటుందని చెప్పి సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పాడు జక్కన్న.

తన కెరియర్ లో ఎప్పుడూ రిలీజ్ డేట్ ముందు చెప్పి సినిమా చేసింది లేదు. అయితే ఇప్పుడు ఆ చెప్పిన డేట్ కు సినిమా రిలీజ్ చేయడం కష్టమే అని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే చరణ్ కు గాయాలవడం ఆ తర్వాత తారక్ కు దెబ్బ తగలడం ఇలా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సైరా రిలీజ్ ప్రమోషన్స్ లో చరణ్ సినిమాకు లాంగ్ గ్యాప్ ఇచ్చేశాడు. వీటన్నిటిని చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ అనుకున్న రిలీజ్ డేట్ కు రావడం కష్టమని అంటున్నారు.   

జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేయాలని అనుకున్న జక్కన్న ఇప్పుడు షూటింగే మే, జూన్ వరకు పట్టేలా ఉందని అందుకే సినిమా రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో ఉన్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అదే నిజమైతే 2021 సంక్రాంతికి మరే సినిమా ఆర్.ఆర్.ఆర్ కు పోటీ వచ్చే సాహసం చేయరని చెప్పొచ్చు. మరి అసలు రిలీజ్ ఎప్పుడన్నది చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తే బెటర్.