
ఓంకార్ డైరక్షన్ లో త్వరలో రిలీజ్ అవబోతున్న సినిమా రాజు గారి గది 3. అశ్విన్, అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమా సస్పెన్స్, కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా సినిమా నుండి బయటకు వెళ్లిన విషయంపై ప్రస్థావించారు మూవీ హీరో అశ్విన్. రాజు గారి గది 3 సినిమా ముహుర్తంలో హీరోయిన్ తమన్నా పాల్గొంది. అసలైతే సినిమా ఆమె చేయాల్సింది కాని ఆమె డేట్స్ వల్ల సినిమా నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
తమన్నా ఓంకార్ ని ఇబ్బంది పెట్టడం వల్లే ఆమెను సినిమా నుండి తీసేశారన్న టాక్ వచ్చింది. ఈ వార్తలకు బ్రేక్ వేశాడు అశ్విన్. తమన్నా కోసం సినిమా రెండు షెడ్యూల్ షూటింగ్ ఆపేశామని అయినా సరే ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాలేదని అందుకే అవికా గోర్ తో చేశామని చెప్పారు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనబడలేదు. మళ్లీ రాజు గారి గది 3లో ప్రత్యక్షమవుతుంది. ఈ సినిమా హిట్టైతే అవికా వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉంది.