
సంక్రాంతికి సినిమాల సందడి కామనే. స్టార్ హీరోల సినిమాలు వరుస కట్టి రిలీజ్ చేస్తారు. ఎప్పటిలానే 2020 సంక్రాతికి స్టార్ సినిమాలు వస్తున్నాయి. ఈసారి కూడా మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవనున్నాయి. వాటిలో మెయిన్ గా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు పోటీ పడుతున్నాయి. మిగతావి ఏమో కాని ఈ రెండు సినిమాలు మాత్రం పొంగల్ వార్ లో దిగటం పక్కా.
అయితే రెండు సినిమాలు రిలీజ్ అయినా కనీసం వీటి మధ్య రెండు రోజుల గ్యాప్ అయినా ఉంటుందని అనుకున్నారు. కాని ఈరోజు సడెన్ గా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మరోపక్క బన్ని అల వైకుంఠపురములో సినిమా కూడా జనవరి 12న రిలీజ్ అని పోస్టర్స్ వదిలారు. సో ఒకేరోజు రెండు సినిమాలు అంటే రెండు సినిమాల మధ్య పోటీ కన్ ఫాం అని తెలుస్తుంది.
సంక్రాంతికి సీజన్ లో ఒకేరోజు వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు కాని ఫస్ట్ డే కలక్షన్స్ మాత్రం లెక్క తప్పే అవకాశం ఉంటుంది. మరి సంక్రాంతికి పోటీకి సై అన్న హీరోలు ఎవరికి వారు మేం తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా ఒకేరోజు తలపడుతున్నారు. మహేష్ వర్సెస్ బన్ని ఫైట్ లో గెలుపెవరిదో చూడాలి.