
ఈ ఇయర్ వచ్చిన రెండు భారీ బడ్జెట్ సినిమాలు సాహో సైరా. సాహో కన్నా సైరా కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో ఆశించిన స్థాయిలో లేదు. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సాహో సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన సైరా సినిమా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. టాక్ సూపర్ అనేలా ఉన్నా వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయి.
ఈ సినిమా కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో హిట్టు అనిపించుకున్నా మిగతా ఏరియాల్లో మాత్రం లాసులు తెచ్చేలా కనిపిస్తుంది. ఇదిలాంటే సాహో తర్వాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఆ మూవీ తర్వాత సైరా డైరక్టర్ సురేందర్ రెడ్డితో ప్రభాస్ సినిమా ఉంటుందని టాక్. సైరా సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం ఓ లైన్ అనుకున్నాడట. ఈమధ్య డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.