
బిగ్ బాస్ సీజన్ 3 12వ వారం ఎలిమినేషన్ లో ముగ్గురు ఇంటి సభ్యులు ఉన్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో ఈ వారం నామినేషన్స్ లో రాహుల్, వరుణ్, మహేష్ నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం ట్రాలీ పార్కింగ్ టాస్క్ లో వీరు ముగ్గురు నామినేట్ అయ్యారు. అయితే వీరితో పాటుగా వితిక కూడా నామినేషన్స్ లో ఉన్నా ఆమెకు మెడాలియన్ ఉంది కాబట్టి ఇమ్యునిటీ లభించింది.
ఇదిలాఉంటే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మహేష్, వరుణ్, రాహుల్ లలో మహేష్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఫన్ బకెట్ లో కామెడీతో మెప్పించి సినిమా ఛాన్సులు అందుకున్న మహేష్ బిగ్ బాస్ హౌజ్ లో బుల్లితెర ప్రేక్షకులను మరింత దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం గ్రూపులున్న బిగ్ బాస్ హౌజ్ లో తను ఏ గ్రూపుకి చెందిన వాడిగా కాకుండా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అతనికి బాగా మైనస్ అయ్యింది. వచ్చిన లీకులను బట్టి చూస్తే మహేషే ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు కాబట్టి అఫిషియల్ గా తెలిసే వరకు వెయిట్ చేయాల్సిందే.