
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య తెలుగులో కాస్త ఫాం కోల్పోయినట్టు అనిపిస్తున్నా బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో అడపాదడపా ఛాన్సులు అందుకుంటున్న రకుల్ తనకు అవకాశాలు రావట్లేదు అనంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. తానే కావాలని హింది సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరక ఇక్కడ సినిమాలు వదులుకున్నా అని చెప్పుకొస్తుంది. ఇదిలాఉంటే తెలుగు, తమిళ భాషల్లో కొంతమందితో జోడీ కట్టాలని ఉందని తన మనసులోని కోరిక బయటపెట్టింది ఈ అమ్మడు.
కోలీవుడ్ లో కమల్ హాసన్ తో నటించాలని ఉందని చెప్పిన రకుల్ తెలుగులో మాత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ వస్తే చేస్తా అని అంటుంది. విజయ్ దేవరకొండతో సినిమా అంటే లిప్ లాక్స్ ఉంటాయి. అంటే అతని సినిమాలో అవకాశం వస్తే అవి చేసేందుకు కూడా రకుల్ సై అన్నట్టే లెక్క. మరి రకుల్ కోరికను విజయ్ నెరవేరుస్తాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరి డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టాడు. ఆ మూవీ డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.