జాన్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పిరియాడికల్ లవ్ స్టొరీ గా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా జాన్ అని పరిశీలనలో ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా కూడా దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. 

సెట్స్ మీద ఉన్న సినిమా ఫస్ట్ లుక్ కోసం స్టార్ హీరోల ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు. ప్రభాస్ జాన్ ఫస్ట్ లుక్ కోసం  ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకే ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ నెల 23న ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ వస్తుందని సమాచారం. సాహో తో అంచనాలను అందుకోలేని ప్రభాస్ జాన్ తో అయినా మరోసారి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.