
నాచురల్ స్టార్ నాని కెరియర్ లో సూపర్ హిట్ మూవీ అలా మొదలైంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నానికి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. ఈ మూవీతోనే నానికి ఒక మార్కెట్ ఏర్పడింది. ఇక అప్పటినుండి నాని తన నాచురల్ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఇయర్ ఆల్రెడీ రెండు సూపర్ హిట్లు కొట్టాడు నాని.
ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో 'V' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని మరోసారి నందిని రెడ్డి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడని తెలుస్తుంది. అలా మొదలైంది తర్వాత నాని నందిని కలిసి చేసే సినిమా ఇదే.. స్వప్న సినిమా బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఓ బేబీ తో హిట్టు కొట్టిన నందిని రెడ్డి నాని తో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి.