సూర్య మంచి మనసు

కోలీవుడ్ హీరో సూర్య మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. తమిళ సిని పరిశ్రమలోని దర్శకుల సంఘానికి 10 లక్షలు విరాళంగా ఇచ్చాడు సూర్య. దర్శకుల సంఘం అభివృద్ధికి ఇది ఉపయోగించాలని ఆయన అన్నారు. సూర్య 10 లక్షల చెక్ ను దర్శకుల సంఘం కార్యదర్శి ఆర్వి ఉదయ్ కుమార్ కు అందచేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ ఆస్తి నష్టం జరిగిన సమయాల్లో కూడా ముందుగా స్పందించే హీరో సూర్య.  

కేరళ ఫ్లడ్స్, వైజాగ్ తుఫాను టైంలో కూడా పాతిక లక్షల విరాళం ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు సూర్య. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అతను లేనిది సినిమానే లేదు అలాంటి దర్శకుల సంఘం బాగుండాలని సూర్య చేసిన ఈ మంచి పనికి అందరు మెచ్చుకుంటున్నారు. స్వతహాగా తనంతట తానే ముందుకొచ్చి ఈ విరాళ ప్రకటించడం విశేషం.