
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు పడేసరికి అతనికి ఫుల్ డిమాండ్ పెరిగింది. మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. అందుకే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ ఎఫ్-2, గద్దలకొండ గణేష్ రెండు హిట్లు కొట్టిన వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటితో సినిమా చేస్తున్నాడు.
ఇప్పటివరకు 4 నుండి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న వరుణ్ తేజ్ ఇక మీదట తనతో సినిమా అంటే 8 కోట్లు కావాల్సిందే అని చెబుతున్నాడట. ఎలాగు మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి తన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని దర్శక నిర్మాతలు కూడా అందుకు సై అంటున్నారట. మెగా ప్రిన్స్ గా స్క్రీన్ నేం వేసుకోవడమే కాదు మస్త్ జబర్దస్త్ ఫాం కూడా కొనసాగిస్తున్నాడు వరుణ్ తేజ్.