
హీరోయిన్ గా రాణించాలంటే ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తుంటారు. కొందరు సినిమా కోసం ఎలా అయినా కనిపించాలని అనుకుంటే.. మరికొందరు మాత్రం కేవలం ఒకళా మాత్రమే తమని ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఈమధ్య తెలుగు సినిమాల్లో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే ప్రతి సినిమాలో ఏదో ఒక సందర్భంలో హీరోయిన్ లిప్ లాక్ ఉంటుంది. కొన్ని సినిమాలు కేవలం ఆ లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ కోసమే తీస్తున్నారా అన్నట్టుగా కూడా ఉన్నాయి.
అయితే ఈ లిప్ లాక్స్, హాట్ సీన్స్ కూడా ఓకే చెప్పే భామలు కొంతమంది ఉంటే కొందరు మాత్రం అలాంటివి చేయమని చెప్పేస్తారు. తెలుగులో పిల్లజమిందార్ సినిమాలో హీరోయిన్ గా అలరించిన హరిప్రియ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. లేటెస్ట్ గా అమ్మడు ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ చేయగా అందరు ఆ లిప్ లాక్ సీన్ ను గీతా గోవిందం సినిమాలో రష్మిక మందన్న లిప్ లక్ సీన్ తో పోల్చుతున్నారట.
సినిమాలో లిప్ లాక్ ఉన్న మాట వాస్తవమే కాని దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అంతేకాదు వేరే వాళ్లలా తను చేయలేనని చెప్పుకొచ్చింది హరి ప్రియ. రష్మిక మందన్న సక్సెస్ ఫుల్ హీరోయిన్ అలాంటి హీరోయిన్ తో పోల్చుకుని హరిప్రియ ఎందుకు కామెంట్స్ చేసిందో ఎవరికి అర్ధం కాలేదు. కన్నడలో ఆమె నటిస్తున్న ఎల్లెడ్డే లిల్లీదంకా సినిమాలో హరిప్రియ లిప్ లాక్ చేసింది. సృజన్ లోకేష్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది.