
సినిమా పరిశ్రమలో వారసుల హవా గురించి అందరికి తెలిసిందే. పొలిటిషియన్ కొడుకు పొలిటిషియన్ అయినట్టుగానే స్టార్ హీరో కొడుకు స్టార్ కావాల్సిందే. అయితే మొదటి రెండు ఛాన్సులు తండ్రి స్టార్ ఇమేజ్ వల్ల వచ్చినా ఆ తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఒకే ఫ్యామిలీ నుండి వచ్చి పరిశ్రమను ఏలేస్తున్న వారిలో మెగా ఫ్యామిలీ ముందుందని చెప్పొచ్చు.
ఇదిలాఉంటే మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. అదేంటి రావాల్సిన వారంతా వచ్చేశారుగా ఇంకా ఎవరు మిగిలారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది. రేణు దేశాయ్ తో విడిపోయినా సరే అకిరా, ఆద్యలు పవన్ కు సన్నిహితంగానే ఉంటున్నారు. పవన్ వారసుడు అకిరానే అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ బాధ్యత కూడా రాం చరణ్ మీద ఉందని తెలుస్తుంది. తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి బాబాయ్ మీద అభిమానం చాటుకుంటాడని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లోనే అకిరా సినిమా ఉంటుందని టాక్. అకిరా హీరో అవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది.