బిగ్ బాస్ ను బ్యాన్ చేయండి

బుల్లితెర మీద బాగా క్లిక్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో కేవలం 3వ సీజన్ మాత్రమే నడుస్తుంది కాని బాలీవుడ్ లో ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తుంది. రీసెంట్ గా 13వ సీజన్ మొదలైంది. అయితే బిగ్ బాస్ సంప్రదాయాలను మంటకలుపుతుందని.. కుటుంబమంతా కలిసి చూడలేకపోతున్నామని కర్ణి సేన సంస్థకు చెందిన కొందరు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. జాతీయ మీడియా వేదికగా ఈ షో హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తుందని వారు అంటున్నారు.      

అంతేకాదు ఈ రియాలిటీ షో ద్వారా జిహాద్ ను ప్రమోట్ చేస్తున్నట్టు ఉందని కూడా లేఖలో ప్రస్థావించారు. వెంటనే ఆ షోని బ్యాన్ చేయాలని..  కేంద్రమంత్రితో పాటుగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కు లేఖ అందించారు కర్ణిసేన సంస్థకు చెందిన ప్రతినిధులు. కుటుంబంతో కలిసి చూడలేని ఇలాంటి షోల వల్ల సమాజం పాడవుతుందని అందుకే షోని బ్యాన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.