చిరు సినిమాలో చరణ్ కూడా..!

60 ఏళ్లు దాటినా సరే సీనియర్ స్టార్ తమ దూకుడు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైది నంబర్ 150తో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సైరా సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. సినిమా వసూళ్ల గురించి పక్కన పెడితే ఇప్పటికి చిరంజీవిలో స్టామినా ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. ఇక దసరా సందర్భంగా చిరు 152వ సినిమా ముహుర్తం పెట్టుకున్నారు.

కొరటాల శివ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటుగా మ్యాట్నీ మూవీస్ ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతుంది. అయితే ఈ సినిమాలో మరో ట్విస్ట్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తారట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని చిరు సినిమాలో చరణ్ ఉంటాడని టాక్. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చిరంజీవి పాత్రలో చరణ్ కనిపిస్తాడట. అంటే యంగ్ చిరుగా చరణ్ అదరగొడతాడన్నమాట. ఒక్క టికెట్ తో చిరు, చరణ్ ఇద్దరిని తెర మీద చూసేయొచ్చు ఇక మెగా ఫ్యాన్స్ కు ఇంతకుమించి ఏం కవాలి చెప్పండి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.