మళ్ళీ రాజమౌళి వల్లే అది సాధ్యమా.. !

సినిమా తీయడం గొప్ప విషయం కాదు ఆ సినిమా హిట్టు కొట్టడం గొప్ప విషయం. వరుసగా రెండు సినిమాలు హిట్టు పడగానే తానేం తీసినా ప్రేక్షకులు చూస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. దానితో కాస్త గురి తప్పుతుంది కానీ తన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి బాహుబలి 2  వరకు తీసిన ప్రతి సినిమా హిట్టు కొట్టడం అనేది మాములు విషయం కాదు. 

చేసింది 11 సినిమాలు ఒక దానికి మించి మరోటి అన్నట్టుగా తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నాడు రాజమౌళి. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు అయ్యాడు. తెలుగు సినిమా పరిశ్రమ బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేలా కేవలం ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ సినిమా ప్రస్థానాన్ని ప్రపంచం దేశాలకు తెలిసేలా చేశాడు. అయితే బాహుబలి తర్వాత కూడా తెలుగులో భారీ బడ్జెట్ సినిమా లు వస్తున్నాయి కానీ ఆ రేంజ్ విజయాన్ని అందుకోవడంలో విఫలమవుతున్నాయి.  అందుకే బాహుబలి రికార్డులను తను తీసే RRR తోనే బ్రేక్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్,  రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు కాబట్టి RRR మరో సంచలనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజమౌళికి మైతెలంగాణ.కామ్ తరపున  హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.