స్టార్ హీరోయిన్ కు విస్కీ అంటే పిచ్చి

బాలీవుడ్ తరహా సినిమాలే కాదు అక్కడ స్మాల్ స్క్రీన్ షోస్ కూడా సౌత్ కు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో బీ టౌన్ హుంగామా ఎక్కువ కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ సూపర్ హిట్టైన షో కాన్సెప్ట్ లను తెలుగులో కూడా ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ బాలీవుడ్ లో క్లిక్ అయ్యాక టాలీవుడ్ కు వచ్చింది. 

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా బాలీవుడ్ సెలబ్రిటీస్ బెడ్ రూమ్ సీక్రెట్స్ తో ఒక షో వస్తుంది. అక్కడ సూపర్ హిట్ అయిన ఆ షో ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చింది. ఫీట్ అప్ విత్ స్టార్ట్స్ తెలుగులో మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్ట్స్ ఈ షోలో పాల్గొన్నారు.  లేటెస్ట్ గా శృతి హాసన్ ఈ షోకి వచ్చింది. తన సీక్రెట్స్ ఏమామాత్రం భయపడకుండా బయటపెట్టిన శృతి హాసన్ తనకు విస్కీ అలవాటు ఉండేదని ఒప్పుకుంది. 

దాని వల్ల కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని అది మానేశాక ఎలాంటి సమస్యలు లేవని చెప్పుకొచ్చింది శృతి హాసన్. మొత్తానికి శ్రుతి తనకు మందు అలవాటు ఉందని ఒప్పుకోవడం విశేషం. ఒక స్టార్ కూతురుగా శృతి ఇలా తన సీక్రెట్ బయటపెట్టడం గొప్ప విషయమే అని చెప్పాలి.