
టాలీవుడ్ లో కమెడియన్ స్థాయి నుండి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటాడు. లేటెస్ట్ గా నిర్మాత పివిపితో గొడవతో మరోసారి బండ్ల గణేష్ హాట్ న్యూస్ గా మారాడు. బండ్ల గణేష్ తనకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా తన మనుషులతో బెదింపులకు దిగాడని నిర్మాత పివిపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాక్షన్ లోకి దిగిన పోలీసులు బండ్ల గణేష్ కోసం ఇంటికి వెళ్తే అతను పరారీలో ఉన్నట్టు తెలిసింది.
ఇక శనివారం ఉదయం ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ తో షాక్ ఇచ్చాడు బండ్ల గణేష్. ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ ఏపి ప్రజలకు రాజన్న పాలన ఇస్తుంటే ఆయన పేరు చెప్పుకుని పివిపి లాంటి వారు చంపేస్తామని బెదిస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే కేసు ఎలాగు ఫైల్ అయ్యింది కాబట్టి ఇద్దరిని విచారించిన తర్వాత ఎవరిది కరెక్ట్ అన్నది తెలుస్తుంది. అయితే బండ్ల వేసిన ట్వీట్స్ మాత్రం అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.