
యువ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా లైన్ లో పెట్టాడు నితిన్. ఇదే కాకుండా చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా చదరంగం అని ఫిక్స్ చేశారట.
చందరంగం ఇంటిజెంట్ గేమ్.. అంటే సినిమా కూడా అలానే ఉండబోతుందన్నమాట. సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని అంటున్నారు. నితిన్ మొదటిసారి ఇలాంటి థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి నితిన్ ఆడే చదరంగం ఎలాంటి థ్రిల్ కలిగిస్తుందో చూడాలి. రాజమౌళి సైతం మెచ్చే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేస్తున్న చదరంగం ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ సైతం ఎక్సైటింగ్ గా ఉన్నారు.