స్టార్ హీరోతో స్టార్ డైరక్టర్ కూతురు పెళ్లి..!

సిని పరిశ్రమలో ఎవరు ఎవరితో ఎప్పుడు ప్రేమలో పడతారో ఎవరికి తెలియదు. సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన వారు కూడా ఆఫ్ స్క్రీన్ ఆ రిలేషన్ ను కొనసాగిస్తారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా సెలబ్రిటీస్ లవ్ స్టోరీస్ అందరికి తెలిసినవే. ఇక ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ స్టార్ హీరో తనయుడితో ఓ స్టార్ డైరక్టర్ కూతురు ప్రేమ హాట్ న్యూస్ గా మారింది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్.. అక్కడ స్టార్ డైరక్టర్ అయిన ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ ప్రేమలో పడ్డాడట.

మోహన్ లాల్, ప్రియదర్శన్ మంచి స్నేహితులు.. అలానే చిన్నప్పటి నుండి కళ్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ లు కూడా గుడ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. అయితే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా తెలిపారట. త్వరలోనే ప్రణవ్, కళ్యాణ్ ల పెళ్లిపై అఫిషియల్ న్యూస్ బయటకు వస్తుందట. కొన్నాళ్లుగా తాను ఒకరిని ప్రేమిస్తున్నా అంటూ చెబుతున్న కళ్యాణి ఆ పేరుని మాత్రం రివీల్ చేయలేదు. మళయాళ భామే అయినా తెలుగులో కళ్యాణి ప్రియదర్శన్ వరుస సినిమాలు చేస్తుంది.