వోగ్ మేగజైన్ కవర్ పేజ్ పై మహేష్.. కటౌట్ అదిరింది..!

ఈమధ్య బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు హీరోల క్రేజ్ ఉందని చెప్పొచ్చు. బాహుబలి ముందు వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ పై కన్నేసి ఉంచారు బాలీవుడ్ మేకర్స్. వారు ఊహించిన దాని కన్నా ఎక్కువ బడ్జెట్ తో.. ఎక్కువ క్రియేటివ్ సినిమాలు చేస్తున్నారు మన వాళ్లు. అందుకే ఇక్కడ స్టార్స్ మీద బాలీవుడ్ మీడియా ఫోకస్ ఎక్కువైంది.

లేటెస్ట్ గా వోగ్ మేగజైన్ కు కవర్ పేజ్ కి ఎక్కేశాడు సూపర్ స్టార్ మహేష్. కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన మహేష్ కు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఏర్పడింది. వోగ్ మేగజైన్ కవర్ పేజ్ పై వెనక్కి తిరిగిన మహేష్ స్టిల్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అందరు మాములుగా కనిపించేలా స్టిల్ ఇస్తాడు. అలా కనిపించేలా అయితే తనని ఎలాగు ఇష్టపడతారు కాబట్టి వెనక్కి తిరిగి స్టిల్ ఇచ్చాడు మహేష్. ఈ స్టిల్ చూసి మేగజైన్ కొనేవాళ్లు కూడా ఉంటారు. ప్రస్తుతం మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.