సైరా సినిమాపై నారా లోకేష్ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా బుధవారం రిలీజై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన సిని, రాజకీయ ప్రముఖులు సైతం చిరుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లేటెస్ట్ గా సైరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు నారా లోకేష్. సైరా సినిమా చూసిన లోకేష్ ఆ సినిమా గురించి ట్వీట్ వేయడం విశేషం. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా సైరా.. చిరంజీవి గారి 12 ఏళ్ల కల అని నారా లోకేష్ అన్నారు. తన కలను అద్భ్హుతంగా ఆవిష్కరించుకున్నారని అన్నారు లోకేష్.   

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి స్వాతంత్ర పోరాటం తెర మీద చూస్తుంటే ఒళ్లు గగుర్పిడిచిందని వెళ్లడించారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు అభినందనలు తెలియచేశాడు. సైరా సినిమాను అద్బుతంగా తెరకెక్కించారని.. ఇంతంటి ఘన విజయాన్ని అందుకున్న రాం చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, ఇతర టెక్నిషియన్స్ యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు నారా లోకేష్. ఫైనల్ గా హ్యాట్సాఫ్ చిరంజీవి గారు అంటూ కామెంట్ పెట్టారు.