
తెలుగు పరిశ్రమలో తాము ఎంచుకున్న పాత్రకు తగినట్టుగా తమని తాము మలచుకునే స్టార్స్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ముందు ఉంటాడని మాత్రం చెప్పొచ్చు. జై లవ కుశ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా రేంజ్ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఆ పాత్ర కోసం ఇప్పటికే తన ఆహార్యం మార్చుకున్న తారక్ రీసెంట్ గా ఓ లుక్ రివీల్ చేశారు.
ఆ స్టిల్ చూసి ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ లుక్ ఇలానే ఉండబోతుంది అంటూ ప్రచారం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్ లుక్ ఇదే అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్ తో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే.