నిజంగానే గుండు కొట్టించారు..!

సైరా సినిమాలో నరసింహా రెడ్డికి పక్కన ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించి మెప్పించాడు బ్రహ్మాజి. ఒక సీన్ లో అతనికి గుండు కొడతారు. అయితే అది న్యాచురల్ గా ఉండేందుకు నిజంగానే బ్రహ్మాజి గుండు కొట్టించుకున్నాడట. సినిమా అంటే అంత ప్యాషన్ ఉండబట్టే ఇప్పటికి బ్రహ్మాజి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య బ్రహ్మాజి దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు.

ఇక ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ బ్రహ్మాజి నిర్మాత రాం చరణ్ తనకి గుండు కొట్టించాడని కామెడీగా చెబుతున్నాడు. ఏ పాత్రకు ఎలా కనిపించాలి.. దానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టకపోవడం వల్లే బ్రహ్మాజి కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. సైరాలో అతని పాత్రకు మంచి పేరు వచ్చింది. దాదాపుగా సినిమాలో నటించిన మిగతా హీరోలు అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతిల పాత్రల్లానే బ్రహ్మాజి పాత్ర కూడా ఉంది. అయితే అతనికి స్క్రీన్ స్పేస్ ఉన్నా డైలాగ్స్ తక్కువగా ఉన్నాయి.