
బుధవారం రిలీజైన సైరా నరసింహా రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. అయితే సైరా సక్సెస్ జోష్ లో భాగంగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో సైరా యూనిట్ కు పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది. చిరంజీవితో సహా మెగా హీరోలంతా ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరితో పాటుగా అఖిల్, శ్రీంకాత్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.
12 ఏళ్లుగా తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా నరసిం హా రెడ్డి సినిమాను తీసి హిట్ కొట్టాడు చిరంజీవి. సినిమాలో ఆయన నటనకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని అభిమానులంతా ఖుషి అయ్యారు. బన్ని ఇచ్చిన సైరా సక్సెస్ పార్టీలో బన్ని వాసు, డైరక్టర్స్ వంశీ పైడిపల్లి, కొరటాల శివ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.