తమన్నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్.. ఎవరిచ్చారో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా సక్సెస్ అవడంతో మెగా ఫ్యామిలీలో అంతా సూపర్ హ్యాపీగా ఉన్నారు. రిలీజ్ కు నెక్స్ట్ రోజే థ్యాంక్స్ టూ ఇండియా అంటూ సక్సెస్ మీట్ పెట్టి సినిమా గురించి చెప్పిన చిత్రయూనిట్.. రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ ఇంకాస్త పెంచిందని చెప్పొచ్చు. ఇక ఈ సక్సెస్ జోష్ లో మెగా కోడలు ఉపాసన కూడా కానుకలు ఇచ్చేస్తుంది. సినిమాలో లక్ష్మి పాత్రలో నటించి మెప్పించిన తమన్నాకు ఉపాసన ఓ డైమండ్ గిఫ్ట్ ఇచ్చింది.

సైరా సినిమాలో అందరు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా చిరు తర్వాత అంత బాగా కనెక్ట్ అయిన పాత్ర అంటే అది లక్ష్మి పాత్రే. అందుకే ఉపాసన తమన్నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది. రాం చరణ్ నిర్మించిన సైరా నరసింహా రెడ్డి సినిమా బుధవారం రిలీజై మంచి టాక్ తో దూసుకెళ్తుంది. తెలుగు తమిళ హింది కన్నడ మళయాళ భాషల్లో ఈ సినిమా భారీగా రిలీజైంది.