సైరా చరణ్ తో తియ్యండని అడిగాడట..!

సైరా నరసింహా రెడ్డి సినిమా సక్సెస్ మెగా ఫ్యామిలీలో సంబరాలను తెచ్చింది. బుధవారం రిలీజైన సైరా సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైరా కథా రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ సైరా మా 16 ఏళ్ల కల అని అన్నారు. 2004లో చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు పరుచూరి వెంకటేశ్వర్ రావు సైరా కథ రాశాడు.

సినిమాలో చిరంజీవిని హీరోగా పెట్టి చేయాలన్నది మా డ్రీమ్. అయితే ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లో ఉండటం వల్ల సినిమా చేయలేదు. బడ్జెట్ లిమింటేషన్స్ కూడా ఉండేవి. సైరా సినిమాను చరణ్ తో చేయమని చిరంజీవి అడిగారట. కాని పరుచూరి బ్రదర్స్ మాకు మీరే కావాలన్నారట. అలా చిరు కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. మొత్తానికి సైరా సినిమా అంచనాలకు తగినట్టుగా వచ్చి మెగా ఫ్యాన్స్ కు దసరా పండుగ ముందే తెచ్చింది.