అల్లు అర్జున్ కొత్తింటికి వెరైటీ పేరు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్తింటికి భూమి పూజ చేశాడు. ఈ కొత్తింటికి బ్లెస్సింగ్స్ అని పేరు పెడుతున్నారు. ఈరోజు కొత్తింటికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అయాన్, అల్లు అర్హ పాల్గొన్నారు. ఈ ఇంటికి బ్లెస్సింగ్ అని వెరైటీ పేరు పెట్టడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు.       

త్రివిక్రం, బన్ని కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కాంబినేషన్ గా ఈ సినిమా వస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2020 సన్ర్కాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాలో నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.