మెగాస్టార్ బయోపిక్ చరణ్ అయితే వద్దు..!

బుధవారం రిలీజైన సైరా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రయూనిట్ అంతా సంతోషంగా ఉన్నారు. మెగా కాంపౌండ్ అయితే ఈ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా థ్యాంక్స్ టూ ఇండియా ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి బయోపిక్ ప్రస్థావన రావడం విశేషం.   

మీ బయోపిక్ లో చరణ్ నటిస్తే ఎలా ఉంటుందని చిరుని అడిగితే.. తన బయోపిక్ లో చరణ్ వద్దని అంటున్నాడు చిరంజీవి. ఎందుకంటే తన కొడుకు చరణ్ పుట్టిన సన్నివేశంలో తన పాత్రలో చరణ్ అతన్ని ఎత్తుకోవడం మంచిగా ఉండదు. అందుకే చరణ్ తప్ప మా ఫ్యామిలీలో ఎవరినా తన బయోపిక్ చెయొచ్చని అన్నాడు చిరంజీవి. సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లు తాను యంగ్ ఏజ్ లో ఉంటాయో అలా అనిపిస్తారు కాబట్టి వాళ్లలో ఎవరో ఒకరు తన బయోపిక్ చేస్తే బెటర్ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.