
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా ఎంతటి సంచలన విజయం అందుకుందో అందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు గీతా గోవిందం సినిమా కూడా క్రేజీ హిట్ అందించింది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవబోతుందని తెలుస్తుంది.
బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ రోహిత్ శెట్టి గీతా గోవిందం రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఆయన డైరక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ లో హీరోగా దఢక్ ఫేమ్ ఇశాంత్ కత్తర్ నటిస్తాడని తెలుస్తుంది. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి గీతా గోవిందంతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.