సైరాలో అనుష్క సర్ ప్రైజ్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ అత్యన భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. ఇక సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ ఏంటంటే స్వీటీ అనుష్క ఝాన్సి లక్ష్మీ బాయిగా నటించడమే.     

ఓపెనింగ్ సీన్ పవర్ స్టార్ వాయిస్ ఇవ్వగా ఝాన్సి లక్ష్మి బాయిగా అనుష్క అదరగొట్టేసింది. సిపాయి తిరుగుబాటు సమయంలో ఝాన్సి లక్ష్మి బాయి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వీరత్వం గురించి చెబుతుంది. ఓపెనింగ్ సీన్ నుండి కథ నడిపించిన అనుష్క క్లైమాక్స్ లో కూడా అదరగొట్టింది. అనుష్క ఎంట్రీతో సినిమా మరో లెవల్ కు వెళ్లిందని చెప్పొచ్చు.